తెలంగాణ

telangana

ETV Bharat / crime

తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య.. నీ వెంటే నేను వస్తున్నా అంటూ! - ఆత్మహత్య

Young Man Commits Suicide in Siddipet: అమ్మ ప్రేమ ఎలాంటిదో.. ఏ చెట్టుని పుట్టని అడిగిన చెప్పుతాయి. అమ్మ ప్రేమను మించిన అనుబంధం లేదు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మ ఇక లేదు అని తెలిస్తే.. గుండె ఆగిపోవడం ఖాయం. అమ్మ లోకాన్ని వదిలిసేసి తనను ఒంటరి చేసి వెళ్లిపోయిందనే బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది.

die
తల్లి కుమారులు మృతి

By

Published : Jan 10, 2023, 9:53 AM IST

Young Man Commits Suicide in Siddipet: తల్లి మరణం తట్టుకోలేని ఓ కుమారుడు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. నెల రోజుల కిందట తల్లి.. తరువాత కుమారుడు.. పురుగుమందు తాగి చనిపోయారు. గ్రామస్థులు, సిద్దిపేట టూ టౌన్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలు.. చిన్నకోడూరుకు చెందిన నిమ్మల రాజు - సునీత (40) భార్యాభర్తలు. కౌలు రైతులైన వారు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారులు విఘ్నేశ్‌ (21), వివేక్‌ ఉన్నారు.

ఒడిబియ్యం విషయంలో భర్తతో గొడవపడిన సునీత మనస్తాపంతో గత నెల 5న ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8న చనిపోయింది. అప్పటి నుంచి పెద్ద కుమారుడైన విఘ్నేశ్‌ తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో అదేరోజు ఇంటి నుంచి బయల్దేరి సిద్దిపేటకు చేరుకున్నాడు. స్థానిక నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్దకు చేరుకొని తండ్రి, బంధువులకు వీడియోకాల్‌ చేశాడు.

ఇన్‌స్టాగ్రాంలో తల్లితో కలిసి ఉన్న ఫొటోలు, సందేశం

అమ్మ చనిపోవడం బాధగా ఉందని, తండ్రికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయాంటూ ప్రస్తావించాడు. వారించినా వినకుండా అమ్మలేని లోకంలో ఉండనంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే చిన్నకోడూరు ఎస్‌ఐ శివానందంను బాధిత కుటుంబీకులు ఆశ్రయించగా.. లొకేషన్‌ను గుర్తించి టూ టౌన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటిన సిద్దిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అపస్మారక స్థితిలో పడిపోయిన యువకుడిని సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు తరలించారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

సందేశం పంపి..విఘ్నేశ్‌ ఎంబీఏ చదువుతున్నాడు. చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రాం స్టేటస్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో తల్లితో కలిసి దిగిన ఫొటో, సందేశాన్ని జత చేసి పోస్టు చేశాడు. ‘స్వర్గంలో ఉంటున్న అమ్మా.. నీవద్దకు రావాలని కోరుకుంటున్నా. నిన్ను చేరేందుకు సిద్ధంగా ఉన్నా.. రెండు చేతులు చాపి ఒడిలోకి తీసుకో..’ అంటూ సందేశాన్ని జోడించాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details