ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని... మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కదిరే కోటి రాములు(21) అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలుసు. అనుకోకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిపై కొద్ది నెలల కిందట హాలియా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో... ఇరువురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ నెల 19న ఆ అమ్మాయికి వేరొకరితో వివాహం నిశ్చయించారు. దీంతో ఆ యువతి, ఆమె తల్లి... కోటి రాములుకు ఫోన్ చేసి నిశ్చితార్థం ఆపాలని కోరారు. దానికోసం పురుగుల మందు తాగినట్లు నటించి నిశ్చయ తాంబూలం ఆపాలని అతనితో చెప్పారు. కాని ఈనెల 21న రాత్రి 11 గంటల సమయంలో నిజంగానే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు రాములు.