Murder: యువకుడిని కాటేసిన ప్రేమ వ్యవహారం! - ap news
20:24 October 11
Murder: ప్రేమ వ్యవహారంలో యువకుడు దారుణ హత్య
ఏపీలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన బండారు గోపీ (19) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతో కిరాయి ముఠాతో యువకుడిని చంపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమ కుమారుడు కనిపించలేదంటూ గోపీ తల్లిదండ్రులు పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. యువకుడు హత్యకు గురైనట్టు గుర్తించారు.
ఇదీ చదవండి:Bike accident: యువకుడి అత్యుత్సాహానికి వృద్ధుడు బలి...