Young man murder in Hanamkonda : తన కుమార్తె మృతికి కారణమయ్యాడన్న అనుమానంతో ఓ వ్యక్తి, అతడి కుటుంబసభ్యులు ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటలో శనివారం ఉదయం కలకలం రేపింది. కాజీపేట ఏసీపీ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాదన్నపేటకు చెందిన పదో తరగతి చదివే అక్షయ (15)ను గత ఆదివారం ఆమె దూరపు బంధువైన గుండపు రాజు (22).. సమీపంలోని పెంబర్తి వద్ద గల పాఠశాలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు.
కుమార్తె మృతికి కారణమయ్యాడన్న అనుమానం.. యువకుడి దారుణ హత్య - కమలాపూర్ లో యువకుడి దారుణ హత్య
Young man murder in Hanamkonda : హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె మృతికి కారణమయ్యాడన్న అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటికి వచ్చాక ఇద్దరూ అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించారు. అక్షయ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రాజు ఆసుపత్రి నుంచి శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి అతడికి ఫిట వచ్చాయి. శనివారం ఉదయం అతడిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అక్షయ తండ్రి, బంధువులు దాడి చేశారు. బాలిక తండ్రి కనుకుంట్ల లేలేందర్.. రాజు కడుపులో కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు తల్లి సరోజిని ఫిర్యాదు మేరకు లేలేందర్ సహా ఏడుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. లేలేందర్‌కు అక్షయ ఏకైక కుమార్తె. మృతుడు రాజు.. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కాగా, అతనికి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
ఇవీ చదవండి: