తెలంగాణ

telangana

ETV Bharat / crime

attack with knife: ప్రేమించలేదని ఉన్మాదం.. యువతిపై కత్తితో దాడికి యత్నం - arandal peta news

ప్రేమించమంటూ వెంటపడిన ఓ ఉన్మాది యువతిపై కత్తితో దాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో జరిగింది.

young man attack with knife on his girl friend
young man attack with knife on his girl friend

By

Published : May 31, 2021, 4:52 PM IST

Updated : May 31, 2021, 5:05 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్‌పేటలో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. తెలిసిన వారితో బయటకొచ్చిన ఓ యువతిని ప్రేమించమంటూ వెంటపడ్డాడు. కత్తితో ఆమెపై దాడికి యత్నించాడు. ఇంతలో ఆమెతో పాటు ఉన్న స్నేహితులు ఆ ఉన్మాదిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

రెచ్చిపోయిన నిందితుడు.. వారి బైక్‌ సీటుపై కత్తితో గాట్లు పెట్టాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో.. వారిని చూసి జారుకున్నాడు. ఘటనపై అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది.

ప్రేమించలేదని ఉన్మాదం.. యువతిపై కత్తితో దాడికి యత్నం

ఇదీ చూడండి:మద్యానికి డబ్బు కోసం భార్యతో గొడవపడి... విద్యుత్​ వైర్లు పట్టుకున్న భర్త!

Last Updated : May 31, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details