తెలంగాణ

telangana

ETV Bharat / crime

ATTACK : విశాఖలో ప్రేమోన్మాది దాడి.. అసలేం జరిగింది..! - vizag crime

ఏపీలోని విశాఖలో సూర్యాబాగ్‌(suryabag area in vizag) ప్రాంతంలోని ఓ హోటల్​లో ఉన్మాది దాడి(attack) కలకలం రేపింది. నగరానికి చెందిన యువతి, తెలంగాణలోని భూపాలపల్లి(bhupalapalli) ప్రాంతానికి చెందిన హర్షవర్థన్‌రెడ్డి మంటల్లో కాలుతుండటం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

విశాఖలో ప్రేమోన్మాది దాడి
విశాఖలో ప్రేమోన్మాది దాడి

By

Published : Nov 14, 2021, 6:57 PM IST

ఏపీలో విశాఖ(vizag in AP) నగరంలోని సూర్యాబాగ్‌ (suryabag area in vizag)ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటన చర్చనీయాంశమయింది. నగరానికి చెందిన యువతి, తెలంగాణలోని భూపాలపల్లి (bhupalapalli in telangana) ప్రాంతానికి చెందిన హర్షవర్థన్‌రెడ్డి మంటల్లో కాలుతుండటం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం సుమారు 4.15 గంటల సమయానికి ప్రమాదం జరిగితే పోలీసులకు 6.30గంటలకు సమాచారం అందింది. తీవ్రమైన రద్దీ ప్రాంతంలో ప్రమాదం జరిగినా పోలీసులకు సమాచారం తక్షణం అందలేదు. హోటల్‌ గదిలో ఏమి జరిగిందన్న విషయాన్ని యువతి తండ్రికి చెప్పగా... అదే విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తీవ్రమైన గాయాలతో విలవిల్లాడుతూ కనిపించేసరికి ఆ తండ్రి కూడా కన్నీరుమున్నీరయ్యారు. దీంతో పోలీసులు యువతి తండ్రిని ఏమీ ప్రశ్నించలేకపోయారు. సంఘటన స్థలం దగ్గరున్న కొన్ని ఆధారాలను మాత్రం సేకరించారు. హోటల్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నిఘా కెమేరాల్లో నిక్షిప్తమైన సీసీఫుటేజీని పరిశీలిస్తున్నారు. పెట్రోల్‌ను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు? ఎంత పరిమాణంలో కొనుగోలుచేశాడన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. యువతీ, యువకుల ఫోన్‌ నెంబర్ల ఆధారంగా వారి మిత్రులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి కూడా కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువతి జీన్‌ ఫ్యాంట్‌ ధరించి ఉండడంతో నడుము నుంచి కాళ్ల వరకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ ఆమె ముఖం నుంచి నడుము వరకు మాత్రం తీవ్రంగా కాలిపోయింది. యువకుడు హర్షవర్థన్‌రెడ్డికి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డాడు.

తండ్రితో మాట్లాడాలని...

సంఘటన అనంతరం యువతి తన తండ్రితో మాట్లాడాలని భావించినట్లు ఆమెను రక్షించడానికి వెళ్లినవారు చెబుతున్నారు. తలుపులు తెరిచి గదిలోకి వెళ్లిన వారికి ఆ యువతి తలుపు వెనుక కూర్చొని ఉండటం గమనించారు. శరీరంపై కొంత మేర దుస్తులు కూడా కాలిపోవడంతో ఆమెకు వస్త్రాలను కప్పి బయటకు తీసుకువచ్చారు. తన తండ్రితో మాట్లాడాలని యువతి చెప్పడంతో ఆమెను రక్షించడానికి వెళ్లిన వారు కూడా కొంత వెనకడుగు వేసినట్లు సమాచారం. ఫోన్‌ ఇస్తే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో చాలామంది ఫోన్‌ ఉన్నప్పటికీ ఇవ్వలేదు. ఆ తరువాత తండ్రితో మాట్లాడగలగడంతో తనకు ఏమి జరిగిందన్న విషయాన్ని కొంత వరకు వివరించినట్లు సమాచారం.

ఇవీచదవండి.

Harassment at school: బాలికలపై జిల్లా అధికారి వేధింపులు.. చంపేస్తానంటూ బెదిరింపులు

Petrol Attack: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి

Panjagutta girl murder: ఆ చిన్నారిని చంపింది కన్నతల్లే... ప్రియుడితో కలిసి కిరాతకంగా...

ABOUT THE AUTHOR

...view details