మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అవి లభించకపోవడం వల్ల ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. భద్రాచలానికి చెందిన గుర్రం సందీప్ (22) మత్తు పదార్థాలకు బానిసై కుటుంబ సభ్యులను వేధించేవాడని ఎస్సై బాలకృష్ణ తెలిపారు. ఇంటికి దూరంగా ఉంటే మార్పు వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు... అశ్వారావుపేటలోని బంధువుల ఇంట్లో ఉంచినట్లు తెలిపారు.
మత్తు పదార్థాలకు బానిసై యువకుడు ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎంత అవగాహన కల్పించినా యువత పెడచెవిన పెడుతున్నారు. వాటికి బానిసై ఆత్మహత్యలకు పాల్పడి... కన్నవారికి గర్భశోకం మిగుల్చుతున్నారు. మత్తు పదార్థాలకు లభించకపోవడం వల్ల ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
![మత్తు పదార్థాలకు బానిసై యువకుడు ఆత్మహత్య Young man addicted to drugs commits suicide . drug addict suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:31:07:1619758867-11583347-sui.jpg)
మత్తు పదార్థాలకు బానిసై యువకుడు ఆత్మహత్య, భద్రాచలంలో యువకుడు ఆత్మహత్య
బంధువుల ఇంట్లోనూ మత్తుపదార్థాలు కావాలని అడిగేవాడని చెప్పారు. నగదు ఇవ్వాలని బంధువులను వేధించేవాడని పేర్కొన్నారు. ఎంతకీ లభించకపోవడం వల్ల ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Last Updated : Apr 30, 2021, 11:50 AM IST