తెలంగాణ

telangana

ETV Bharat / crime

Young Girl Suicide: దంపతుల మధ్య గొడవ.. ఇద్దరి ప్రాణాలు బలి - Telangana News

Young Girl Suicide: భార్యాభర్తల మధ్య వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. పంచాయితీ చేస్తుండగా చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. ఆ ఘటనలో పోలీసు కేసుల భయంతో మరో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Young Girl
Young Girl

By

Published : May 10, 2022, 2:36 PM IST

Young Girl Suicide: దంపతుల మధ్య తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకున్న ఘటనలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోగా... తాజాగా మరో బాలిక ఆత్మహత్య చేసుకోవడం తీవ్రవిషాదాన్ని నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన భార్యభర్తల మధ్య మనస్పర్థలతో ఇరువురి కుటుంబసభ్యులు ఈనెల 5న పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి... ఘర్షణకు దారితీసింది. రాళ్లు, కర్రలు, కారంపొడితో దాడిచేసుకోవటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో అబ్బాయి తరఫున వచ్చిన ఆర్గుల్‌కు చెందిన రాజన్న చనిపోయాడు. దీంతో పోలీసులు ఆరుగురిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వీరిలో నారాయణ అనే వ్యక్తి ఉండగా... పోలీసులు జైలుకు తరలించారు. తీవ్రఆందోళనకు గురైన ఆయన కుమార్తె తేజస్విని... ఇంట్లో పురుగుల మందు సేవించింది. నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలు, ఇరుకుటుంబాల తీరుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం తీవ్రవిషాదాన్ని మిగిల్చింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details