త్వరలో వివాహం కావాల్సిన యువతికి పని చూపిస్తామని తీసుకెళ్లి.. మద్యం తాగించి అత్యాచారం(young woman rape in Mahbubnagar) చేసిన ఘటన ఇది. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్ రాజు (35), మహబూబ్‌నగర్ మండలం కోటకదిర గ్రామానికి చెందిన ఆంజనేయులు (27) పెయింటర్లు(painters raped a woman)గా పని చేస్తున్నారు. ఆ యువకులిద్దరు వివాహితులే.
Young girl rape in Mahbubnagar: యువతిపై అత్యాచారం.. ఆపై వీడియో తీసి!
రెండు వారాల్లో పెళ్లి చేసుకోబోతున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి(young woman rape in Mahbubnagar) పాల్పడ్డారు. ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఆమె వివాహమాడనున్న వ్యక్తికి పంపించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రోజూ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతానికి వచ్చి అడ్డాలో నిలబడి పని దొరికిన చోటుకు వెళుతుంటారు. ఈ నెల 5న అదే అడ్డాలో ఓ యువతి (21)కి పని ఇస్తామని, తమవెంట రమ్మని బలవంతపెట్టారు. పట్టణ శివారులో పని ఉందని, కూలీ డబ్బు ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి వారి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతికి మద్యం తాగించి అత్యాచారానికి(young woman rape in Mahbubnagar) పాల్పడ్డారు. ఆ దృశ్యాలను చరవాణిలో బంధించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు.
ఈ నెల 18న ఆమెకు వివాహం కావాల్సి ఉండడంతో దాన్ని చెడగొట్టాలని భావించి చరవాణి(rape recorded in mobile)లో తీసిన చిత్రాలను ఈనెల 10న ఆ యువతికి కాబోయే భర్తకు వాట్సాప్(rape video in WhatsApp) ద్వారా పంపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజున యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం టీడీగుట్ట అడ్డా వద్ద ఉన్న యువకులను అరెస్టు చేశారు.