విద్యుదాఘాతంతో గుగులోతు రవి(35) అనే రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మీట్యాతండా శివారు పంతులు తండాలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మరణించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. న్యాయం కోసం తండావాసులతో కలసి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి - Mahabubabad District News
విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పంతులు తండాలో చోటు చేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మరణించాడని మృతుడి బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ తండావాసులతో కలసి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.
Farmer dies of electric shock
విషయం తెలుసుకున్న నెల్లికుదురు ఎస్ఐ జితేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఫిర్యాదు చేస్తే.... నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మృతుల బంధువులను ఓదార్చారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీనిచ్చారు.