వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లింగారెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒగ్గు కనకయ్య(36)కు అరెకరం భూమి ఉంది. దానితో పాటు కొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ, వ్యవసాయానికి సంబంధించి మండలానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద.. పాసు పుస్తకాన్ని తనఖా పెట్టి.. మూడేళ్ల కిందట రూ. మూడు లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో కొంత తీర్చాడు. మిగిలిన అప్పు తీర్చాలంటూ ఆ వ్యాపారి వేధించసాగాడు. నాలుగు రోజుల క్రితం కనకయ్యకు కోర్టు నుంచి లీగల్ నోటీసు పంపించాడు.
వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక.. యువ రైతు ఆత్మహత్య - వడ్డీ వ్యాపారి వేధింపులకు రైతు ఆత్మహత్య
వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. అప్పు తీర్చాలంటూ వ్యాపారి పంపించిన కోర్టు నోటీసులకు కలత చెంది.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లీగల్ నోటీసు అందుకున్న రైతు.. మనోవేదనకు గురయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక నోటీస్‌తో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందాడు. శనివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'నేను చనిపోతున్నా'.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య