భూమి పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని.. యువరైతు సెల్‌టవర్ ఎక్కిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే రాజమల్లు.. పాసు పుస్తకం కోసం గత కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెంది టవర్ ఎక్కినట్లు తెలిపాడు.
Cell tower:సెల్ టవర్ ఎక్కిన యువ రైతు.. ఏం జరిగిందంటే.! - young farmer climbed the cell tower in thiryani mandal
రెవెన్యూ అధికారుల తీరుతో విసుగు చెందిన యువరైతు సెల్‌టవర్ ఎక్కాడు. తన భూమి పాసు పుస్తకం ఇచ్చే వరకు దిగేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
టవర్ ఎక్కి రైతు హల్చల్
విషయం తెలుసుకున్న తహసీల్దార్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాసు పుస్తకం వచ్చిందని చెప్పడంతో టవర్ దిగడానికి ఒప్పుకున్నాడు. కిందికి దిగిన అనంతరం అతనికి పాసు పుస్తకం అప్పగించారు. రైతు టవర్ ఎక్కడంతో దాదాపు గంట సమయం పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి:DRUNKER HALCHAL: విద్యుత్ స్తంభం ఎక్కి తాగుబోతు హల్చల్