తెలంగాణ

telangana

ETV Bharat / crime

COUPLE DIED: చెదిరిన కల.. కన్నీటి అల.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల మృతి - అనంతపురం తాజా వార్తలు

ఉన్నత ఆశలు.. అంతలోనే రాలిపోయాయి. విదేశీ యానం.. ఆపదతో ముగిసిపోయింది. కలల ప్రపంచం.. దరిచేరని అలగా మారింది. నవదంపతుల(COUPLE DIED) జీవన ప్రయాణం.. విషాద తీరాలకు చేరింది. పెళ్లి ఆనందం.. ఇరవై రోజుల్లోనే ఆవిరైంది. ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది.

young-couple-died-in-road-in-accident-in-anantapuram-district
చెదిరిన కల.. కన్నీటి అల.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల మృతి

By

Published : Jul 8, 2021, 9:32 AM IST

నవ దంపతుల జీవన ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం పెళ్లి ఆనందాన్ని చెరిపేసింది.. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. ఏపీలోని అనంతపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఆర్‌ఐ దంపతులు(COUPLE DIED) బుధవారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో(ROAD ACCIDENT) మృతిచెందారు. అనంతపురానికి చెందిన విష్ణు వర్దన్‌(28), కడపకు చెందిన కుల్వ కీర్తి(25) ఉన్నత విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగాలు కూడా సంపాదించారు. ఇక అక్కడే ఉండాలని నిశ్చయించుకున్న వారు అమెరికాలోనే స్థిరపడ్డారు. జీవితంలో స్థిరపడ్డందున గత జూన్‌ 19న వీరిద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు.

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేటప్పుడు...

రెండు రోజుల కిందట విష్ణువర్ధన్, కీర్తిలు బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం కారులో అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్మేపర్తి గ్రామ సమీపంలో రోడ్డు దాటే సమయంలో ద్విచక్ర వాహనం కారుకు అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయి కారు డివైడరును ఢీకొట్టి(CAR ACCIDENT) అటువైపు దారిలో వస్తున్న కంటైనర్‌కు ఢీకొని, రోడ్డు దిగువన ఉన్న గోతిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు కీర్తి, విష్ణవర్ధన్​లను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కీర్తి అక్కడికి వెళ్లేసరికే(NRI DIED) చనిపోయింది. విష్ణువర్ధన్ పరిస్థితి విషమించడంతో... అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

పోలీసుల విచారణ...

రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విష్ణువర్దన్‌ తండ్రి సుధాకర్‌ నాయుడు సహాయ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కీర్తి తండ్రి కడపలో పంచాయతీరాజ్‌శాఖలో డీఈగా పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ ఈ నెల 25న అమెరికాకు తిరుగు ప్రయాణం కోసం విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:FREE WATER: ఉచిత నీటి పథకం పొందేందుకు జలమండలి మరో అవకాశం

ABOUT THE AUTHOR

...view details