తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుటుంబ సమస్యలతో యువజంట ఆత్మహత్య - కుటుంబ సమస్యలతో భార్యభర్తల బలవన్మరణం

సొంతరాష్ట్రాన్ని వదిలి జీవనోపాధి కోసం వచ్చారు. జీవనాధారంగా నమ్ముకున్న పానీపూరి వ్యాపారం అంతంత మాత్రంగానే నడుస్తోంది. దానికి తోడు సంతానం లేకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్​నగర్​ జిల్లాకేంద్రంలోని కుమ్మర్​వాడిలో జరిగింది.

Young couple commit suicide with family problems in mahaboobnagar district
కుటుంబ సమస్యలతో యువజంట ఆత్మహత్య

By

Published : Feb 4, 2021, 9:36 PM IST

కుటుంబ సమస్యలతో యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకుని తనువులు చాలించారు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్​నగర్ జిల్లాకేంద్రంలోని కుమ్మర్​వాడిలో జరిగింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రాహుల్‌ (22), కరీనా(20) రెండు నెలల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వలస వచ్చిన ఈ యువ జంట పానీపూరి వ్యాపారం నిర్వహిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వ్యాపారం సరిగా జరగడం లేదని బాధపడేవారని పోలీసులు తెలిపారు. గతనెల కరీనాకు గర్భస్రావం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వారు నివసించే అద్దెగదిలో ఫ్యాన్​కు వేలాడుతూ కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :'రైతులకు పరిహారం చెల్లింపుల అంశంలో కౌంటర్​ వేయండి'

ABOUT THE AUTHOR

...view details