తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ycp leader arrest: దివ్యాంగురాలి అత్యాచారం కేసు.. వైకాపా నాయకుడు అరెస్ట్

విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైకాపా నేత నాళ్ల‌ వెంక‌ట‌రావు(40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 21వ తేదీన గూడెం కొత్తవీధి మండలం సీలేరులో దారుణానికి పాల్పడగా.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య ప‌రీక్ష‌ల కోసం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు.

Ycp leader arrest
దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైకాపా నేత నాళ్ల‌ వెంక‌ట‌రావు అరెస్ట్

By

Published : Sep 24, 2021, 8:56 PM IST

ఏపీలోని విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైకాపా నాయ‌కుడిని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన దివ్యాంగ ఒంట‌రి మ‌హిళ‌పై ఈ నెల 21 అర్ధరాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన నాళ్ల‌వెంక‌ట‌రావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్ర‌వారం ఉద‌యం ఒడిశా వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. సీలేరు జ‌లాశ‌యం వ‌ద్ద చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నార‌ు. అనంతరం నాళ్లవెంకటరావును అరెస్ట్ చేసి, వైద్య ప‌రీక్ష‌ల కోసం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. నిందితున్ని న‌ర్సీప‌ట్నం కోర్టులో హాజ‌రుప‌రిచినట్లు గూడెం కొత్తవీధి సీఐ అశోక్‌ కుమార్ తెలిపారు.

ఇదీ జరిగింది..

ఈనెల 21వ తేదీన విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలిపై వైకాపా నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ అశోక్‌కుమార్‌ కథనం మేరకు.. సీలేరుకు చెందిన దివ్యాంగురాలి(30)ని వివాహమైన కొద్ది నెలలకే భర్త వదిలేశాడు. ఆమె తల్లి వద్దే ఉంటూ స్థానికంగా వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం బాధితురాలి తమ్ముడు జబ్బుపడగా.. తల్లి విజయనగరానికి తీసుకెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలు సోమవారం అర్ధరాత్రి ఆరుబయట ఉన్న మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన వైకాపా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకటరావు ఆమెపై దాడిచేసి చున్నీతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లికి విషయం తెలియడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. వెంకటరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

అత్యాచార ఘటనపై పలువురి ఆగ్రహం..

అత్యాచార కేసుల్లో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుని.. కిందిస్థాయిలోని కొందరు వైకాపా నేతలు ఆడబిడ్డల జీవితాలతో చెలగాట మాడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ‘విశాఖపట్నం జిల్లాలో దివ్యాంగురాలిపై వైకాపా నేత వెంకటరావు అత్యాచారానికి పాల్పడితే.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. శాంతిభద్రతల అమల్లో ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమ’ని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీచదవండి:

మూగ యువతిపై కన్నేసిన కామాంధుడు.. శివారుకు తీసుకెళ్లి..

ABOUT THE AUTHOR

...view details