అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు వెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల పరిధిలో చోటు చేసుకుంది. కంచల్ తండాకు చెందిన ధీరావత్ సుశీల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె అంత్యక్రియలకు భర్త నరసింహ మిత్రులు తుర్కపల్లి మండలం నాగాయిపల్లి తండాకు చెందిన బానోతు రమేష్(32) అక్కడికి వచ్చారు.
అంత్యక్రియలకు వచ్చి.. కుంటలో మునిగిపోయాడు - yadadri bhuivanagiri latest news
అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన బొమ్మలరామారం మండలంలోని కంచల్ తండాలో జరిగింది.
కుంటలో మునిగిపోయాడు
అంత్యక్రియలు ముగిశాక నీటి కుంటలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ఊరినే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు!