యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో హుక్కా పరికరం, గంజాయి పొట్లాలు లభించాయి. స్థానికంగా ఉన్న ఓ వెంచర్ సమీపంలో గ్రామస్థులకు ఇవి కనిపించాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ganja: గౌరాయిపల్లిలో గంజాయి కలకలం - తెలంగాణలో గంజాయి
యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లిలో గంజాయి పొట్లాలతో పాటు హుక్కా పరికరం స్థానికులకు దొరకడం కలకలం రేపింది. గ్రామాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ganja
వీటికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు. గ్రామాల్లో గంజాయి విక్రయాలపై పోలీసులు నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసై యువత పాడైపోయే ప్రమాదం ఉందన్నారు.
ఇదీ చూడండి:గంజాయి రూపు మార్చుకుంది.. యువత భవిష్యత్తు అంధకారం అవుతోంది!