Wrong route accident: వాహనం నడిపే సమయంలో రాంగ్ రూట్‌లో ప్రయాణించడం ద్వారా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ నెల 22న మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ యూ టర్నింగ్ వద్ద ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్తుండగా.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
Viral Video : రాంగ్ రూట్‌లో వెళ్తే ఇంతే.. జర ఆలోచించండి..! - కూకట్‌పల్లి రోడ్డు ప్రమాదం
Wrong route accident: ఆఫీస్‌కు సమయానికి వెళ్లాలనే తొందర. లేట్ అయితే బాస్ తిడతారనే భయం. ఈ క్రమంలో అతివేగంతో రోడ్డు ప్రయాణం. మార్గ మధ్యలో రోడ్డు దాటాల్సి వస్తే.. యూ టర్న్ వరకూ వెళ్లాలి. అలా వెళ్తే కొంత సమయం వృథా అవుతుందనే ఆందోళన.. అందుకే తప్పని తెలిసినా రాంగ్ రూట్‌లో ప్రయాణం చేస్తాం. మరికొందరేమో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతారు. అలాంటి నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు.
Wrong route accident
అదృష్టవశాత్తు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇద్దరు ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా ఆటో డ్రైవర్ అక్కడి నుంచి రాంగ్ రూట్‌లో పారిపోయాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వీడియో షేర్ చేశారు.
ఇదీ చదవండి :Etela Rajender on KCR: 'ఈ రెండేళ్లే.. ఆ తర్వాత తెరాస అధికారంలో ఉండదు'