మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న ముప్పారం గ్రామంలో మిరప తోటలు ఏరి వస్తున్న కూలీల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. లక్ష్మీనర్సమ్మ అనే మహిళా కూలీ మృతి చెందగా... 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి - Mahabubabad District crime News
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుగుర్తి శివారులో కూలీల ఆటో బోల్తా పడగా ఒకరు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
ఇదే మార్గంలో వస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్. సీతామహాలక్ష్మి క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కూలీ కుటుంబ సభ్యులకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో వాహనంలో 32 మంది ప్రయాణిస్తున్నామని కూలీలు తెలిపారు.
ఇదీ చదవండి:సెల్ఫీ మోజులో నీటిమునిగి యువకుడు మృతి