Fire Accident: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఏరిన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రైయర్ వద్ద పౌడర్‌ను తీస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి ఆ ప్రాంతమంతా తగలబడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి - crime news
Fire Accident in pharma company: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండ్రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఆ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురిలో కెమిస్ట్ నితీశ్ పండిట్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతను ఆరునెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రమణకుమార్ వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: