మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో విషాదం చోటుచేసుకొంది. కరోనా బారిన పడి బాలింత మృతి చెందింది. గ్రామ సర్పంచ్ కుమార్తె సరిత.. ప్రసవం కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకగా.... హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో శిశువు, బాలింత మృతి - తెలంగాణ నేరవార్తలు
కరోనాతో ఒక రోజు వ్యవధిలోనే శిశువు, బాలింత మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ప్రసవం కోసం కన్నవారి ఇంటికి వచ్చిన సరిత.. మృత్యువాత పడడం వల్ల గూడూరు మండలం దామరవంచలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో శిశువు, బాలింత మృతి
ఐదు రోజుల క్రితం సరితను డెలివరీ కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు జన్మనివ్వగా... రెండ్రోజుల క్రితం శిశువు చనిపోయింది. చికిత్స పొందుతూ సరిత శనివారం మరణించింది. ఒకే రోజు వ్యవధిలో తల్లి, బిడ్డ మరణించటంతో... వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీచూడండి:దారుణం: బాలికపై పెద్దనాన్న అత్యాచారం