తెలంగాణ

telangana

ETV Bharat / crime

Volunteer Suicide: కానిస్టేబుల్‌ తీరుతో వాలంటీరు బలవన్మరణం - ఏపీ నేర వార్తలు

VOLUNTEER SUICIDE IN SRIKALAHASTI: ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?

Volunteer Suicide
కానిస్టేబుల్‌ తీరుతో వాలంటీరు బలవన్మరణం

By

Published : Dec 3, 2021, 12:20 PM IST

WOMEN VOLUNTEER SUICIDE: పెళ్లయిన విషయాన్ని తెలియకుండా ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాళహస్తిలో గురువారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం..

తెనాలికి చెందిన సాంబశివరావు శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాస్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె ఉమామహేశ్వరి(24) తొమ్మిదో వార్డు వాలంటీరుగా పనిచేస్తోంది. తొట్టంబేడు మండలం చేమూరుకు చెందిన కానిస్టేబుల్‌ ప్రసాద్‌ శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రొటోకాల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఉమామహేశ్వరితో ప్రేమయాణం సాగించాడు.

అతను మరో యువతిని ప్రేమిస్తున్నాడని, ఇప్పటికే మరొకరితో వివాహమైనట్లు ఉమామహేశ్వరికి ఇటీవల తెలిసింది. ఈ విషయమై మాట్లాడటానికి ఆమె తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం పట్టణంలోని భరద్వాజతీర్థం వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి సాంబశివరావుపై ప్రసాద్‌ చేయిచేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని ఉమామహేశ్వరి ఇంట్లో ఉరివేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ భాస్కర్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.

  • ఇవీ కూడా చూడండి...

కుటుంబం ఆత్మహత్య

తన భార్యా పిల్లలకు మంచి భవిష్యత్​ ఇవ్వాలనుకున్నాడు ఆ వ్యక్తి. దానికోసం ఎంతైనా కష్టపడాలనుకున్నాడు. దానికోసం స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. కాస్త సంపాదించగానే.. మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. ఒక్కసారిగా నష్టాలు రావడం వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు ఆ దంపతుల మధ్య కలహాలు సృష్టించాయి. తరచూ గొడవలు రేపాయి. అలా భర్తతో గొడవపడిన భార్య పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వ్యాపారంలో నష్టాలు ఓవైపు.. కుటుంబ కలహాలు మరోవైపు అతణ్ని కుంగదీశాయి. భార్యాపిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణ వార్త విన్న భార్య.. పిల్లలను చెరువులో పడేసి తాను దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇలా వ్యాపారంలో నష్టాలు ఓ కుటుంబం ఉసురు తీశాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

యువరైతు ఆత్మహత్య

Farmer Suicide : ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు ఆ యువకుడికి. ఇంతలోనే తండ్రికి అనారోగ్యం. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మాని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు తగ్గిన దిగుబడి.. ఇంకో వైపు పంట నష్టంతో అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చలేనన్న భయంతో.. మనస్తాపం చెందిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం వీర్లగడ్డ తండాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details