ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో విషాదం జరిగింది. న్యూబీ కాలనీలో విజయలక్ష్మి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి(SUSPICIOUS DEATH) చెందింది. వీటీపీఎస్ ఆస్పత్రిలో విజయలక్ష్మి పని చేస్తోంది. భర్త సురేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం(EXTRA MARITAL AFFAIR) పెట్టుకున్నాడనే ఆరోపణ ఉండటంతో.. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు.
Woman suspiciously death: వివాహిత అనుమానాస్పద మృతి - ఏపీ వార్తలు
ఏపీ కృష్ణా జిల్లా (Krishna district) ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది(Woman suspiciously death). భర్తే హత్యచేసి(murder) ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.
SUSPICIOUS DEATH
అందువల్లనే భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త సురేశ్ యత్నిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:student gets pregnant by teacher : విద్యార్థినిని గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టార్