తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. కారణమేంటి? - వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హుజూరాబాద్​లో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే ఆమె మృతి చెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

women suspect death at huzurabad
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. కారణమేంటి?

By

Published : Mar 29, 2021, 12:00 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం రాంపూర్​లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మానుకొండూర్​ మండలం చెంజర్లకు చెందిన మౌనికకు... రాంపూర్​కు చెందిన ధనుంజయ్​తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు, ఐదునెలల కుమార్తె ఉన్నారు.

వేధింపులే కారణమా?

పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని మౌనిక కుటుంబసభ్యులు ఆరోపించారు. అనుమానంతో చిత్రహింసలకు గురి చేసేవారని తెలిపారు. అత్తింటి వారే హత్య చేసి... ఉరి వేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పాపను దగ్గరకు తీసుకున్న సీఐ మాధవి

మాతృ హృదయం

సీఐ మాధవి సంఘటన స్థలాన్ని సందర్శించారు. హత్యకు గల వివరాలపై ఆరా తీశారు. ఐదునెలల పాపను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మౌనిక తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details