నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందెన్పల్లికి చెందిన సత్యమ్మకు... ఉట్కూరు మండలం వల్లంపల్లికి చెందిన అంజప్పకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 10 వేల నగదు... అర తులం బంగారం 20 తులాల వెండి ఇచ్చారు. సత్యమ్మ దంపతులకు ఓ కుమారుడు. కాగా... మరో రూ.50 వేల అదనపు కట్నం తీసుకురావాలంటూ... భర్త, మామ వేధిస్తున్నారు.
అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - women suicide in vallampalli
అదనపు కట్నపు వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం వల్లంపల్లిలో జరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
women suicide for dowry harassments in vallampalli
ఆరేళ్లుగా భరిస్తూ వచ్చిన సత్యమ్మ తీవ్ర మనస్తాపం చెంది... ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి... నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... సత్యమ్మ అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.