కరోనాతో భర్త మరణించటం, పిల్లలకు కరోనా సోకటాన్ని తట్టుకోలేక ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా గణపవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలవల వెంకటేశ్వర్లు (55), ఆయన భార్య భాగ్యలక్ష్మికి కరోనా సోకటంతో నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే మే 1న వెంకటేశ్వర్లు వైరస్ కారణంగా మృతి చెందాడు. భాగ్యలక్ష్మి బుధవారం రాత్రి కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చింది.
కరోనాతో భర్త మరణం.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య - గుంటూరులో విషాదం
పిల్లల చదువులు పూర్తై.. జీవింతంలో నిలదొక్కుకునే సమయానికి కరోనా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కొవిడ్ సోకి మరణించటం, తన ఇద్దరు పిల్లలు వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరటాన్ని ఆ ఇల్లాలు జీర్ణించుకోలేక పోయింది. మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా గణపవరంలో చోటుచేసుకుంది.
ఇదే సమయంలో తన కుమార్తె, కుమారుడు వైరస్ బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. భర్త మరణం, ఇద్దరు పిల్లలకు కరోనా సోకి ఆసుపత్రిలో చేరటంతో ఆమె తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కరోనా కారణంగా కుటుంబం చిన్నాభిన్నమైంది. తల్లిదండ్రులు మృతి చెందిన విషయం తెలియని పిల్లలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం బంధువులను సైతం కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చదవండి:గాంధీలో హెల్ప్‌డెస్క్.. బాధితుల పరిస్థితి తెలుసుకునే వెసులుబాటు