ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతుండగా.. ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి(48) మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.
భర్తకు బ్లాక్ ఫంగస్.. ఆసుపత్రిలో భార్య ఆత్మహత్య - black fungus news
ఏపీలోని కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రి గదిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్తకు బ్లాక్ ఫంగస్ సోకడంతో మనోధైర్యం కోల్పోయి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
భర్తకు బ్లాక్ ఫంగస్.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో.. మనోధైర్యం కోల్పోయిన మహిళ ఈ ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇవీ చదవండి:corona effect: స్మైల్ ప్లీజ్.. అనే వారి జీవితాల్లో కానరాని సంతోషం