తెలంగాణ

telangana

ETV Bharat / crime

'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానినే మీరెవరని ప్రశ్నిస్తారు' - దొంగతనం చేసిన ఇద్దరు మహిళలు

అరుగుపై కూర్చున్నట్లు నటిస్తూనే.. ఇళ్లల్లోకి చొరబడి మొత్తం కాజేస్తారు. దొంగతనం చేశాక.. అదే ఇంట్లో టీవీ, ఫ్యాన్ వేసుకుని దర్జాగా కూర్చుంటారు. తీరా యజమాని వచ్చాక వారినే మీరెవరని ప్రశ్నిస్తారు. ఈ తరహా దొంగతనాలు సినిమాలోనే చూసుంటాం. ఏపీ కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో ఓ అత్త, కోడలు ఈ తరహా దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు.

'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానిని మీరెవరని ప్రశ్నిస్తారు'
'దొంగతనం చేస్తారు... ఇంటి యజమానిని మీరెవరని ప్రశ్నిస్తారు'

By

Published : Mar 23, 2021, 9:04 PM IST

ఏపీ కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో దొంగలు హల్​చల్ చేశారు. కంకిపాడు బస్టాండ్ సమీపంలోని ఓ వీధిలో ఇద్దరు మహిళలు (అత్త, కోడలు) అరుగుపై కూర్చున్నట్టుగా నటిస్తూ... గడియ వేసి ఉన్న ఇంట్లో తలుపులు పగులగొట్టిలోపలికి ప్రవేశించారు. బంగారు నగలు, వస్తువులను సంచిలో వేసుకున్నారు. అనంతరం టీవీ చూస్తూ ఉండగా.. ఇంటి యజమాని వచ్చారు.

మీరు ఎవరు? ఏం కావాలి అని యజమానిని దొంగలు అడగ్గా.. అవాక్కవడం ఆయన వంతైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాద్విత.. రెండు నెలల క్రితమే జైలుకెళ్లి బయటకు వచ్చారు. తాజా ఘనకార్యంతో మళ్లీ కారాగారానికి చేరారు.

ఇవీచూడండి:నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details