బట్టలారేసేందుకు వెళ్లి విద్యుదాఘాతంలో వివాహిత మృత్యువాత పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొమ్ముగూడెంలో జరిగింది. అంతకుముందు పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటి పనులు చేస్తున్న మహిళ మరణించడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Current Shock: విద్యుదాఘాతంతో వివాహిత మృతి - కొమ్ముగూడెం
ఇంట్లోని తన పిల్లలతో ఆనందంగా గడిపిన ఓ మహిళ పట్ల విధి చిన్నచూపు చూసింది. అప్పటిదాకా ఇంటి పనులు చేస్తున్న ఆ వివాహితను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. బట్టలు ఆరేసేందుకు వెళ్లిన మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొమ్ముగూడెంలో జరిగింది.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దుర్గ శ్రీలత(35) బట్టలు అరేస్తుండగా దండెం వైరుకు విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మరణించింది. మృతురాలికి భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న వివాహిత కళ్లెదుటే మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.