తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం - శ్రీకాకుళం వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో హృదయ విదారకరమైన ఘటన జరిగింది. అనారోగ్యం బారినపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. అనంతరం ఆ ఆటో డ్రైవర్​ ఆ మహిళ మృతదేహన్ని నడి రోడ్డుపైనే వదిలి వెళ్లాడు.

covid dead body shifted on bike at srikakulam
బైక్​పై కరోనాతో మృతిచెందిన మహిళ మృతదేహం

By

Published : Apr 27, 2021, 7:31 AM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అమానుష ఘటన జరిగింది. మందస మండలానికి చెందిన ఓ మహిళా అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆక్సిజన్ స్థాయి 35 శాతం మాత్రమే ఉందని.. వెంటనే సిటీ స్కాన్ చేయించాలని సూచించారు. ఆమెను సిటిస్కాన్ కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిటీ స్కాన్ అనంతరం ఆటోలో అక్కడ నుంచి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. గమనించిన ఆటో డ్రైవర్ నడిరోడ్డుపైనే మృతదేహాన్ని దింపేశాడు.

దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు.. పలాస నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం మందసకు ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించారు. అయితే సిటి స్కాన్​లో ఆమెకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన మందస తహసీల్దార్ పాపారావు.. మృతదేహాన్ని నేరుగా శ్మశాన వాటికకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు.

బైక్​పై కరోనాతో మృతిచెందిన మహిళ మృతదేహం తరలింపు

ఇవీచూడండి:మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details