సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ (65) దారుణ హత్యకు గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు ఉసికేబావి అంతమ్మగా గుర్తించారు.
మహిళ దారుణ హత్య.. పనివారిపైనే అనుమానం..!
ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంట్లో పనిచేసే వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మహిళ దారుణ హత్య.. పనివారిపైనే అనుమానం..!
అంతమ్మను బొల్లారంలోని ఆమె ఇంట్లో పని చేసేవారే హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు డబ్బు, నగలు తీసుకుని పారిపోయారని తెలిపారు. ఈ కేసులో పుష్ప అనే మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి... తప్పిన పెనుప్రమాదం