కుమారుడితో సహా ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై పిడుగు పడింది (thunder strike on bike ). ఘటనలో తల్లీ, కుమారుడు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన భర్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే పైవంతెనపై జరిగింది.
thunder strike on couple : బైక్‌పై వెళ్తున్న దంపతులపై పిడుగుపాటు... - బైక్‌పై వెళ్తున్న దంపతులపై పిడుగుపాటు
బైకుపై వెళ్తున్న దంపతులపై పిడుగు పడి తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటన (thunder strike on couple ) మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల (mancherial) రైల్వే వంతెన వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
thunder strike
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన వెంకటేశ్, మౌనిక దంపతులు... తమ కుమారుడు శ్రీయాన్ (8నెలల)ను తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఇంతలో వర్షం మొదలైంది. కొద్దిపాటి చినుకుల్లో తడుస్తూ వెళ్తుండగా.. వీరి బైక్‌పై పిడుగు పడింది. ఘటనలో మౌనిక, శ్రీయాన్ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను స్థానికులు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:పెళ్లి బృందంపై పిడుగు.. 16 మంది మృతి