తెలంగాణ

telangana

ETV Bharat / crime

Crime: అరకులో ముగ్గురు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య - అరకు వార్తలు

ఆంధ్రప్రదేశలోని విశాఖ జిల్లా అరకులోయలో ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముందుగా పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.

aarku
Crime: అరకులో ముగ్గురు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య

By

Published : Jul 17, 2021, 8:46 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన జరిగింది. ఓ తల్లి పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అరకులోయ మండలం సిమిలిగుడకు చెందిన శెట్టి సంజీవ్‌ గిరిజన సహకార సంస్థలో ఒప్పంద సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సురేఖ (28)... కుమార్తె సుశాన (9), కుమారులు షర్విన్‌ (6), సిరిల్‌ (4) ఉన్నారు. కుటుంబంతో సహా సంజీవ్‌ అరకులోయలోని ‘సి’ కాలనీలో నివాసం ఉంటున్నారు.

భార్యాభర్తల మధ్య గొడవలు...

కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ స్థానికులకు కనిపించింది. అదే సమయంలో ముగ్గురు పిల్లలు విగత జీవులై మంచంమీద పడి ఉన్నారు. తన భార్య సురేఖ ముగ్గురు పిల్లలకు విషం పెట్టి... తాను ఉరి వేసుకుందని సంజీవ్‌ చెబుతున్నారు. తండ్రి లక్ష్మయ్య మాత్రం తన అల్లుడే కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను చంపి... భార్యకు ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రానికి తరలించారు. అరకులోయ ఎస్‌.ఐ. షేక్‌ నజీర్‌ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాల గొడవలతో అరకులోయ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి:బావి ప్రమాదంలో 11కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details