నారాయణపేట జిల్లా నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ(40).. కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆమె కనిపించడం లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెరువులో మహిళ మృతదేహం లభ్యం - నారాయణపేట జిల్లా వార్తలు
మతిస్థిమితం కోల్పోయి మహిళ చెరువులో పడి మృతి చెందిన ఘటన నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ ఖాజా మొయినుద్దీన్ తెలిపారు.
చెరువులో మహిళ మృతదేహం లభ్యం
చెరువులో పడి మృతి చెందినట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ తాజా మొయినుద్దీన్ తెలిపారు.
ఇదీ చూడండి: ఆటోలో రక్తం కక్కుకుని చనిపోయాడు..