Woman was murdered by unknown persons: భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ.. పుట్టింటికి వెళితే అక్కడ హత్యకు గురైన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తల్లీ కుమార్తెలపై దాడి చేశారు. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా... తల్లికి తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న కొమ్మెర రాధవ్వ(75)కు కుమార్తె గుజ్జుల సులోచన ఉంది. ఆమెకు వివాహం అయింది. అయితే ఆమె భర్త 20రోజుల క్రితం చనిపోవడంతో ఒంటరిగా ఉండలేక తల్లి వద్దే ఉంటుంది. ఇద్దరు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సులోచన, ఆమె తల్లిపై దాడి చేశారు.