తెలంగాణ

telangana

ETV Bharat / crime

బహిర్భూమికి వెళ్లిన మహిళపై హత్యాచారం! - woman was killed in satyasai district

Woman Murder in SathyaSai District : గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైంది. తల భాగం గుర్తుపట్టలేనంత దారుణంగా ఛిద్రమైంది. హత్య చేశారా? లేక అత్యాచారం చేసి చంపేశారా? అని బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది.

Woman Murder in SathyaSai District
Woman Murder in SathyaSai District

By

Published : May 10, 2022, 8:49 AM IST

Updated : May 10, 2022, 9:04 AM IST

Woman Murder in SathyaSai District : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో మరో దారుణం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన బాలింతను కొందరు వ్యక్తులు బండరాళ్లతో తలపై మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేశారు. అంతకుముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు 7 నెలల కిందట బాబు పుట్టాడు. పది రోజుల క్రితం ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

సోమవారం ఉదయం తన బాబును తోడికోడలుకు అప్పగించి బహిర్భూమికి వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్తకు బంధువులు ఫోన్‌ చేసి చెప్పారు. అనంతరం బంధువుల ఇళ్లలో వాకబు చేశారు. అక్కడా లేకపోవడంతో ఊరి బయట వెతికారు. తల పూర్తిగా ఛిద్రమై విగత జీవిగా పడి ఉన్న బాధితురాలు కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడికి సమీపంలోని ఓ బావి దగ్గర నుంచి బండరాళ్లు తెచ్చి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నలుగురిపై అనుమానం :మహిళ హత్య విషయమై బంధువుల్లో కొందరిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామానికి చెందిన కొందరు ముందస్తు పథకంలో భాగంగానే ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. చంపడానికి ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి ఫోన్‌లోని కాల్‌ లిస్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Last Updated : May 10, 2022, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details