Woman trapped a man : యువకుడిని ఇంటికి పిలిపించుకొని.. డబ్బు తీసుకొని దాడి చేసిన ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.. క్రైమ్ విభాగం సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం హమాలీకాలనీకి చెందిన కందుల వంశీ(25), భార్య పల్లపు రోజా(24), ఆమె సోదరి పల్లపు దేవి ఘట్‌కేసర్ మండలం పోచారానికి వలసొచ్చారు. వీరికి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లెక్చరర్ వీధికి చెందిన సాగి వర్మ(26) పరిచయమయ్యాడు.
ఏకాంతంగా గడుపుదామని పిలిచి.. ఏం చేసిందంటే..? - మహిళ హనీ ట్రాప్
Woman trapped a man : ఇంట్లో ఎవరూ లేరని.. వస్తే తనతో ఏకాంతంగా గడపొచ్చని ఓ యువకుడిని ఇంటికి పిలిపించుకుంది ఓ మహిళ. ఆ యువకుడు ఇంటికి వచ్చిన కాసేపటికే తన భర్త, సోదరి, స్నేహితుడితో కలిసి అతన్ని చితకబాదింది. అనంతరం అతడి వద్ద నుంచి ఏటీఎం తీసుకుని రూ.2.2 లక్షల నగదు డ్రా చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో చోటుచేసుకుంది.
రోజా గత నెల 27న రాత్రి హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగికి(28)కి ఫోన్ చేసి.. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని వస్తే తనతో రాత్రి గడపొచ్చని చెప్పింది. నమ్మిన యువకుడు వెళ్లాడు. మధ్యరాత్రి వంశీ, దేవి, సాగివర్మ ఇంట్లోకి ప్రవేశించి యువకుడిని చితక బాదారు. అతని వద్ద ఉన్న ఏటీఎం, డెబిట్‌కార్డు నుంచి రూ.2.2 లక్షల నగదు డ్రా చేసుకున్నారు. చరవాణి తీసుకొని బెదిరించి పంపించారు. బాధితుడు గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుల నుంచి రూ.1.60 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.