మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్సై లైంగిక వేధింపుల(SEXUAL HARASSMENT) ఆరోపణలు కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారాయత్నానికి(SI RAPE ATTEMPT) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు.
TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... ! - తెలంగాణ వార్తలు

14:23 August 03
TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !
తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. సోమవారం రాత్రి అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్సై ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి.... చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు వెళ్లారు. డీజీపీ కార్యాలయ గేట్లు మూసివేయడంతో పోలీసుల వైఖరికి నిరసనగా కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఇదీ చదవండి:VIVEKA MURDER CASE: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం