తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహిళ అనుమానాస్పద మృతి.. ఒంటిపై గాయాలు.. భర్త పనేనా!

Woman Suspicious Death: మునుగోడు మండలం రావిగూడెంలో ఓ వివాహిత అనుమానస్పద మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. భర్తే కొట్టి చంపేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించడంతో.. పీఎస్‌ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

మహిళ అనుమానాస్పద మృతి.. ఒంటిపై గాయాలు.. భర్త పనేనా!
మహిళ అనుమానాస్పద మృతి.. ఒంటిపై గాయాలు.. భర్త పనేనా!

By

Published : Oct 13, 2022, 2:15 PM IST

Woman Suspicious Death: నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ఒంటిమీద తీవ్రగాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్తే కొట్టి చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

వివాహిత అనుమానస్పద మృతి
పోలీసులకు బంధువులకు మధ్య కొంత ఉద్రిక్తత పరిస్థితి

మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసి ఆసుపత్రికి తరలిస్తుండగా వివాహిత కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో పోస్ట్‌మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో... పోలీసు స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టడంతో... స్టేషన్ లోపలకు దూసుకెళ్లి నిరసన చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details