హైదరాబాద్ పాతబస్తీలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి(woman suspicious death) చెందింది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో నివాసముండే శరీన్ ఫాతిమా ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మృతురాలి భర్త ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఆమెకు ఏడుగురు పిల్లలు ఉన్నారని... ఈవెంట్ ఆర్గనైజర్ అసిస్టెంట్‌గా పనిచేసేదని తెలిపారు. ఆమెకు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని... గతంలో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయని స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆ వ్యక్తి పై కూడా అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.