తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహిళ అనుమానాస్పద మృతి.. అత్తింటి వారి వేధింపులే కారణమా..? - హైదరాబాద్ తాజా నేర వార్తలు

Woman suspicious death: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. అత్తింటి వారి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

police station
పోలీస్​స్టేషన్

By

Published : Apr 12, 2022, 2:57 PM IST

Woman suspicious death: హైదరాబాద్​ వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీలో ఉంటున్న దేవిరెడ్డికి అదే కాలనీకి చెందిన మానసతో 2017లో వివాహం జరిగింది. ఏడాది తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని 2021లో సరూర్​నగర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో అత్తింటివారిపై కేసు నమోదయ్యంది. ఆరోజు నుంచి మానస తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

శనివారం మానస మెదక్​లో ఏడుపాయల దేవాలయానికి వెళ్లింది. అక్కడ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్తింటి వారి వేధింపులే వల్లే మానస చనిపోయిందని మృతురాలి బంధువులు భర్త ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details