తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE : పెళ్లయిన నెల రోజులకే వివాహిత ఆత్మహత్య... కారణమేంటంటే? - crime news in ananthapuram district

పెళ్లయిన 40 రోజులకే ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం(dowry) కోసం అత్తింటి వారి వేధింపులు(harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం(hindupuram)లో జరిగింది.

SUICIDE
SUICIDE

By

Published : Oct 10, 2021, 4:41 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా(ananthapuram district) హిందూపురం పట్టణానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటేశ్​ దంపతుల కుమార్తె పల్లవికి పామిడి గ్రామానికి చెందిన మల్లికార్జునతో ఆగస్టు 27న వివాహ(marriage)మైంది. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం మెట్టింటి వారు పల్లవిని వేధింపులకు గురి చేసే వారని పల్లవి తల్లిదండ్రులు తెలిపారు.

SUICIDE

ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలని తమ కూతురిని మూడు రోజుల క్రితం హిందూపురం పంపించారని వెల్లడించారు. వారి వేధింపులు తాళలేక పల్లవి ఉరివేసుకొని ఆత్మహత్య(suicide with hang) చేసుకుందని వివరించారు. ఈ ఘటనపై పల్లవి తల్లిదండ్రుల ఫిర్యాదు(complaint)తో పోలీసులు కేసు నమోదు(case file) చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని(dead body) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:Sexual Abuse: లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..

ABOUT THE AUTHOR

...view details