Woman Suicide at Shah Inayat Ganj: హైదరాబాద్లోని షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని పీఎస్ వైపు పరుగులు పెట్టింది. అది గమనించిన పోలీసులు వెంటనే మహిళను ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య, చిక్కుల్లో పోలీసులు - పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య
Woman Suicide at Shah Inayat Ganj హైదరాబాద్లోని షా ఇనాయత్ గంజ్ పీఎస్ పరిధిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స పొందుతూ యువతి నిన్న మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో మృతురాలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీఐ అజయ్ తెలిపారు.
మృతురాలి పేరు మానసగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతో భర్త నుంచి ఏడాదిగా మానస దూరంగా ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా అప్పటినుంచి సోదరి భారతి ఇంట్లో మానస నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లు మద్యానికి బానిసై గొడవ పడేవారని సీఐ అజయ్ తెలిపారు. గొడవల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: