తెలంగాణ

telangana

ETV Bharat / crime

బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. అలా జరిగిపోయింది.. - హైదరాబాద్​ రోడ్డు ప్రమాదం

బస్సు కింద పడి మహిళ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే బస్సులో ప్రయాణించిన మహిళ బస్సు దిగి ముందు నుంచి నడుస్తూ వెళ్లింది. అది గమనించకుండా డ్రైవర్‌ బస్సు నడపడంతో... ముందు టైర్ల కింద పడి మహిళ గాయపడింది.

accident
accident

By

Published : Mar 22, 2022, 7:16 PM IST

Updated : Mar 23, 2022, 4:07 PM IST

ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి... అదే బస్ కింద పడి గాయపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 21 రోజుల కిందట హైదరాబాద్‌ ఆఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్​ పరిధిలో.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.

చంచల్ గూడా జేకే టవర్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ... మార్చి 1న ఇంటికి వస్తూ ఆర్టీసీ బస్సు ఎక్కారు. సిద్ది అంబర్ బజార్ వంతెన వద్ద... డ్రైవర్ సైదయ్య బస్సును ఆపాడు. రోడ్డు దాటేందుకు బస్సు ముందు నుంచే వెళ్తుండగా.. అది గమనించని డ్రైవర్ సైదయ్య ముందుకు నడిపాడు.

ప్రమాదవశాత్తు ఆమె... ముందు చక్రాల కింద పడి... గాయపడింది. వెంటనే ఆమెను ఉస్మానియాకు తరలించి.. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కొత్తపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు దిగి రోడ్డు దాటుతుండగా.. అదే బస్సు కింద పడి మృతి

ఇదీ చదవండి :ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. ప్రకటించిన విద్యాశాఖ

Last Updated : Mar 23, 2022, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details