ప్రేమపెళ్లి చేసుకున్న యువకున్ని యువతి బంధువులు చితకబాదిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని కేంద్రంలో జరిగింది. మూడేళ్లుగా ఇరకపల్లి గ్రామానికి చెందిన మడావి సమతను షేర్ల రాము ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గతేడాది జులైలో హైదరాబాద్‌లో పెళ్లిచేసుకుని రహస్యంగా కాపురం చేస్తున్నారు.
లాక్‌డౌన్‌తో తిర్యానికి రావడంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు రాముని చితకబాదారు. గ్రామస్థులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఆగకుండా దాడి చేశారు. రాము భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాని ఎస్‌ఐ రామారావు తెలిపారు.