తెలంగాణ

telangana

ETV Bharat / crime

మాజీ ప్రియుడితో కలిసి బాలుడిపై అఘాయిత్యం.. ఆపై బెదిరించి.. - telangana news

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో 14 ఏళ్ల బాలుడిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. మాయమాటలు చెప్పి బాలుడితో అసభ్యకర వీడియోలు కూడా తీసుకుంది. అనంతరం తన మాజీ ప్రియుడితో కలిసి ఆ బాలుడిని బెదిరించి బంగారం, డబ్బును వసూలు చేసింది. జూబ్లీహిల్స్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

14 ఏళ్ల బాలుడితో మహిళ అసభ్యకరమైన వీడియోలు.. బెదిరించి వసూళ్లు
14 ఏళ్ల బాలుడితో మహిళ అసభ్యకరమైన వీడియోలు.. బెదిరించి వసూళ్లు

By

Published : Dec 3, 2021, 5:36 AM IST

Updated : Dec 3, 2021, 6:44 AM IST

బాలుడిపై దగ్గరి బంధువు అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసి బెదిరింపులకు దిగింది. అతని ఇంట్లోని బంగారం, నగదు స్వాహా చేసింది. ఈ ఘటన హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలుడి(14) కుటుంబం ఇటీవల టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్‌కు మారింది. ఈ సమయంలో అల్మారాలోని 20 తులాల బంగారం కనిపించలేదు. వెదికినా ఫలితం లేకపోయింది.

బాలుణ్ని తల్లి ప్రశ్నించడంతో, బెంగళూరులో నివసించే తండ్రి బంధువుకు ఇచ్చినట్లు తెలిపాడు. ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగా.. గతంలో పాఠశాల వద్దకు వచ్చి తనను చార్మినార్‌లోని లాడ్జ్‌కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపాడు. మాజీ ప్రియుడితో కలిసి దీన్ని ఆమె వీడియో తీసి, బెదిరించడంతో ఇంట్లోని 20 తులాల బంగారంతోపాటు రూ.6 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తన కుమారుడిపై ఆమె మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడిందని చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తల్లి బుధవారం ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడేళ్ల కిందట జరిగిందని, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Last Updated : Dec 3, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details