సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ శివారులో సావిత్రి దారుణ హత్యకు గురైంది. ఆమె ఇస్నాపూర్లో నివాసం ఉంటూ కూలి పని చేస్తుంది. కల్హేర్ మండలం నాగధార గ్రామం నుంచి బతుకుదెరువు కోసం భర్తతో కలిసి ఇక్కడికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
చిట్కుల్ గ్రామ శివారులో మహిళ దారుణ హత్య - చిట్కుల్ గ్రామ శివారులో మహిళ హత్య
బతుకుదెరువు కోసం వలసకూలీగా వచ్చిన ఓ మహిళ సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామ శివారులో దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆమెను తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిట్కుల్ లో మహిళ హత్య, సంగారెడ్డి జిల్లా వార్తలు
శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. వారే అత్యాచారం అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సావిత్రి కనబడటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. తెల్లవారేసరికి హత్యకు గురైందని బంధువులు వాపోయారు.
ఇదీ చూడండి: మైనర్ బాలికతో నాల్గోపెళ్లి..బలవంతంగా అత్యాచారం