తెలంగాణ

telangana

ETV Bharat / crime

పుట్టింటికి వచ్చి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన మహిళ - sangareddy district latest news

పుట్టింటికి వచ్చిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman Missing  in sangareddy
woman Missing in sangareddy

By

Published : Apr 28, 2021, 2:46 AM IST

సంగారెడ్డి జిల్లా పాటి గ్రామానికి చెందిన మౌనికకు పుప్పాలగూడకు చెందిన మహేందర్​తో వివాహం జరిగింది. వీరికి భార్గవి, అన్విత్, శ్లోక ముగ్గురు పిల్లలు. వీరిలో అన్విత్, శ్లోక పుట్టుకతోనే అంగవైకల్యంతో, మందబుద్ధితో ఉండేవారు. అయితే 2 రోజుల క్రితం మౌనిక తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు పోచారం గ్రామంలో బంధువుల దినకర్మ ఉంటే వెళ్లి రాత్రి 8 గంటలకు వచ్చారు. వారు వచ్చేసరికి ఇంట్లో ఉండాల్సిన కూతురు మౌనిక వారి ముగ్గురు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా పక్కింట్లో భార్గవి కనిపించింది. మౌనిక ఆమె పిల్లలు అన్విత్, శ్లోక కనిపించలేదు.

చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించకపోవడంతో తండ్రి నరసింహ బీడీఎల్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరు పిల్లలు అంగవైకల్యంతో ఉండటంతో జీవితంపై విరక్తి చెంది మౌనిక ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కారు ఢీకొట్టిన ఘటనలో బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details