తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - జగిత్యాల జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలై ఓ మహిళ మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman killed in RTC bus collision in Jagityal
ఆర్టీసీ బస్సు ఢీ... మహిళ మృతి

By

Published : Jan 28, 2021, 12:37 PM IST

జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్‌ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. సారంగాపూర్‌ మండలం నాగునూరు లచ్చక్కపేటకు చెందిన మంగ ఆమె భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయమవగా.. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను

ABOUT THE AUTHOR

...view details