మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని - Hyderabad Crime News
10:18 August 29
Woman Killed her Son in Hyderabad మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి
Woman Killed her Son in Hyderabad : హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పరిధి పార్సీగుట్టలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల కుమారుడిని తల్లి చంపేసింది. అనంతరం బాలుడు కిందపడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించింది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Hyderabad Crime News : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి మహిళ తన కన్నకుమారుడిని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివాహేతర సంబంధాలతో కొందరు తమ కన్నబిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.